విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ గవాస్కర్‌ సంచలన కామెంట్స్

విరాట్ కోహ్లీపై.. టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

By Srikanth Gundamalla  Published on  5 May 2024 8:26 AM GMT
cricket, ipl-2024, sunil gavaskar,  virat kohli,

 విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ గవాస్కర్‌ సంచలన కామెంట్స్ 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీపై.. టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక ప్లేయర్ ఆటతీరును బట్టే తాము వ్యాఖ్యానిస్తామని చెప్పారు. 14-15 ఓవర్‌ వరకు క్రీజులో ఉండి.. 118 స్ట్రయిక్‌ రేట్‌తో బ్యాటింగ్ చేస్తే స్లో ఇన్నింగ్స్‌ అంటారని గవాస్కర్‌ చెప్పారు. బయటకు నుంచి వచ్చే విమర్శలకు ఎందుకు బదులిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.

కాగా.. ఇటీవల సన్‌ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌పై గవాస్కర్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్‌ స్లో ఇన్నింగ్స్‌ను ఆడాడు అంటూ చెప్పారు. ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శనను ఆశించట్లేదని చెప్పాడు. తనపై వచ్చిన కామెంట్లపై గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత కోహ్లీ స్పందించాడు. స్ట్రయిక్‌ రేట్‌ తక్కువగా ఉందనరి చెప్పే వారికి ఆటపై పెద్దగా అవగాహన ఉందని ఎద్దేవా చేశాడు. బాక్స్‌లో కూర్చొని ఇలా కామెంటరీ చేయడం చాలా సులువు అనీ.. బయట కూర్చొని కామెంట్స్‌ చేసే వచాలా మందికి మ్యాచ్‌ పరిస్థితి తెలియదంటూ విరాట్ చెప్పాడు.

ఇక విరాట్‌ కోహ్లీ వ్యాఖ్యలపై శనివారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గుజరాత్‌ తో మ్యాచ్‌ సందర్భంగా స్పందించాడు. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోమని చెప్పే ప్లేయర్స్.. ఎందుకు బదులు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. మేం కొంచెమే క్రికెట్ ఆడామనీ.. మీలా ఎక్కువగా ఆడలేదని అన్నారు. అయితే.. తమకు ఇష్టాలు, అయిష్టాలు అంటూ ఉండవని చెప్పాడు. ఆట గురించే విశ్లేషిస్తామని క్లారిటీగా చెప్పారు. స్ట్రయిక్‌ రేటు 118గా ఉన్నప్పుడు వ్యాఖ్యతలు సహజంగానే ప్రశ్నలు లేవనెత్తుతారని గవాస్కర్ అన్నారు. ఈ స్ట్రయిక్‌ రేట్‌తో బ్యాటింగ్ చేస్తే స్లో ఇన్నింగ్స్‌ అంటారనీ.. వాటికి పొగడ్తలు ఉండవు అంటూ విరాట్‌ కోహ్లీని ఉద్దేశించి సునీల్‌ గవాస్కర్‌ మండిపడ్డారు.

Next Story