కాంగ్రెస్‌ అంటేనే కరువు: మాజీమంత్రి హరీశ్‌రావు

హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  5 May 2024 6:14 AM GMT
Telangana, brs, harish rao,  congress, bjp,

కాంగ్రెస్‌ అంటేనే కరువు: మాజీమంత్రి హరీశ్‌రావు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా ఉన్నామని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు ఇచ్చామనీ హరీశ్‌రావు చెప్పారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వం గురించి చెబుతున్నవన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా దేవుళ్లపై ఒట్లు పెట్టి మాట్లాడుతున్నారనీ.. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మరో వైపు కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారనీ.. ఇది ఏమాత్రం సరికాదని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేసీఆర్ చెబితే దుర్భాషలాడతారా అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో ఇబ్బందులు మొదలయ్యాయనీ.. కాంగ్రెస్ అంటేనే కరువు అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.

ముల్కనూర్‌ ముద్దుబిడ్డ సుధీర్‌కుమార్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు హరీశ్‌రావు. ముల్కనూరుకి మొండిచేయి చూపించిన పార్టీ కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఆగిపోయాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణకు పెద్దగా ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. లోక్‌సభలో తెలంగాణ పార్టీ అభ్యర్థులు ఉంటేనే మనకు రావాల్సిన వాటి కోసం గట్టిగా పోరాడుతారని చెప్పారు. అందుకే వినోద్‌ కుమార్‌ను గెలిపించుకోవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Next Story