జ‌గ‌న్‌, చంద్రబాబుల‌కు ఈసీ హెచ్చ‌రిక‌

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడులకు ఎన్నికల సంఘం సోమవారం హెచ్చరికలు జారీ చేసింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 May 2024 4:30 AM GMT
జ‌గ‌న్‌, చంద్రబాబుల‌కు ఈసీ హెచ్చ‌రిక‌

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడులకు ఎన్నికల సంఘం సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రసంగాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సమయంలో ప్రసంగాల సమయంలో ఇద్దరు నేతలు అవమానకరమైన రీతిలో వ్యక్తిగత దాడులు పాల్పడుతూ MCC నిబంధనలను ఉల్లంఘించారని ఎన్నికల సంఘం గుర్తించింది. "కాబట్టి, భవిష్యత్‌లో బహిరంగంగా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఆదేశాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కమీషన్ హెచ్చరిస్తోంది" అని ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఎన్నికల కమీషన్ ఈ తరహా హెచ్చరికలే జారీ చేసింది. "కొన్ని టాలీవుడ్ సినిమాల్లో నాయుడుని విలన్ పాత్రగా చిత్రీకరించడంతో పాటుగా సీఎంను 'నేరస్థుడు', 'పోకిరి', 'శాడిస్ట్' ఇతర పదాలతో దూషించడాన్ని ఎన్నికల సంఘం గమనించింది." అని తెలిపారు. అంతేకాకుండా ఇద్దరు నాయకులు అలాంటి పదాలు, ప్రకటనలను ఉపయోగించకూడదని ఎన్నికల నోటీసులను పట్టించుకోకుండా అలాగే కొనసాగించారని ఎన్నికల సంఘం గుర్తించింది.

అందువల్ల, భవిష్యత్తులో వారి బహిరంగ ప్రసంగాలలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ లను ఆదేశించింది. MCC నిబంధనలను అనుసరిస్తారని, రాజకీయ ఉపన్యాసాలకి ఒక ఉదాహరణగా నిలుస్తారని కమిషన్ ఆశిస్తోందని ఎన్నికల కమీషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 మంది అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story